కోర్టుల్లో హౌస్‌‌‌‌ కీపింగ్ కోసం టెండర్లు ఆహ్వానం

కోర్టుల్లో హౌస్‌‌‌‌ కీపింగ్ కోసం టెండర్లు ఆహ్వానం

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్, సికింద్రాబాద్‌‌‌‌లోని సిటీ సివిల్ కోర్టులు, కల్పతారు కాంప్లెక్స్‌‌‌‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కోర్టు ఆన్ ఫ్యామిలీ డిస్ ప్యూట్స్ ప్రాంగణాల్లో వార్షిక నిర్వహణ, హౌస్‌‌‌‌ కీపింగ్ కాంట్రాక్టుల కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి వై. పద్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 టెండర్ల సమర్పణకు ఈ నెల19 చివరి తేదీ అని, ఆసక్తిగల నిర్వాహకులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.