
హైదరాబాద్, వెలుగు: కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి ఆర్అండ్ బీ టెండర్లు పిలిచింది. గత నెలలో టెండర్లు పిలిచినప్పటికీ ఎన్వోసీలు రావడం ఆలస్యం కావడంతో మరోసారి టెండర్లు పిలుస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. వచ్చే నెల15 వరకు టెండర్లు దాఖలు చేసేందుకు ప్రభుత్వం గడువు విధించింది. వచ్చే నెల 19న అధికారులు టెండర్లు ఓపెన్ చేయనున్నారు. కొత్త హైకోర్టుకు సంబంధించిన కీలకంగా ఉన్న నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ వోసీ)కు అప్లై చేయగా అన్ని శాఖలు నుంచి ఎన్ వోసీలు వచ్చినట్టు ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు.
రాజేంద్రనగర్ లో 100 ఎకరాల్లో రూ.2,583 కోట్లతో కొత్త హైకోర్టు భవనాన్ని గతేడాది డిసెంబర్లో లా డిపార్ట్ మెంట్ అడ్మినిస్ర్టేటివ్ శాంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఆర్ అండ్ బీ ఇచ్చిన డిజైన్ కు జడ్జీల కమిటీ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 10 బ్లాకుల్లో సుమారు 36.5 లక్షల ఎస్ ఎఫ్ టీలో హైకోర్టును నిర్మించనున్నారు. రెండేండ్లలోనే నిర్మాణం పూర్తి చేయాలని టెండర్ దక్కించుకున్న కంపెనీకి ప్రభుత్వం స్పష్టం చేయనుంది.