ముంబై : టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్)లో హైదరాబాద్ స్ట్రైకర్స్ టీమ్ మూడోసారి విజేతగా నిలిచింది. ఆదివారం రాత్రి జరిగిన ఆరో సీజన్ ఫైనల్లో హైదరాబాద్ 51–44తో యష్ ముంబై ఈగల్స్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. తుదిపోరు నాలుగు కేటగిరీల్లోనూ స్ట్రైకర్స్ సత్తా చాటింది. హరియెట్ డార్ట్, బెంజమిన్ లోక్, విష్ణు వర్దన్ తమ జట్టును గెలిపించారు. విమెన్స్ సింగిల్స్‌లో డార్ట్ 14–11తో జేనెప్ సొన్మేజ్ను ఓడించి జట్టుకు శుభారంభం అందించింది.
ALSO READ : వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్ 12వ రౌండ్లో గుకేశ్ ఓటమి
మెన్స్ సింగిల్స్ ముంబై ప్లేయర్ కరన్ సింగ్ 14–11తో లోక్‌పై నెగ్గి స్కోరు సమం చేశాడు. కానీ, కీలకమైన మిక్స్డ్ డబుల్స్‌లో డార్ట్–విష్ణు వర్దన్ 16–9తో జేనెప్–జీవన్‌ను ఓడించారు. చివరిదైన మెన్స్ డబుల్స్‌లో విష్ణు వర్దన్–లోక్.. ముంబై జోడీ కరన్–జీవన్ ఓడించి హైదరాబాద్‌కు టైటిల్ అందించారు.