ఢిల్లీలో కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి : 10వేల సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు

ఢిల్లీలో కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి : 10వేల సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య కోరలు విస్తరిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే నగరంలోని గాలి నాణ్యత భారీగా తగ్గిందని రిపోర్టులు వచ్చాయి. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఏర్పాటు చేసిన 10 వేల మంది సివిల్ డిఫెన్స్ వాలంటీర్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు ఆమె సోమవారం ప్రకటించారు.

ALSO READ : బీజేపీ సంచలన నిర్ణయం: డిప్యూటీ CM ఫడ్నవీస్ మాజీ పీఏకు ఎమ్మెల్యే టికెట్

సిటీలో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి బస్ మార్షల్స్ గా నియమించిన వారిని 2023లో సర్వీసు నుంచి తొలగించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ తగ్గడం, పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల సివిల్ వాలంటీర్లను మళ్లీ డ్యూటీలోకి తీసుకోనున్నారు. నవంబర్ మొదటి వారంలో 10 వేల మంది సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. తర్వాత నాలుగు నెలల పాటు వారికి విధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, రవాణా శాఖతో కలిసి వారు పని చేయనున్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని కంట్రోల్ చేయడమే వారి ముఖ్య ఉద్దేశమని ఆమె అన్నారు.