వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించడంతో ఉక్రెయిన్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాటో మిత్ర దేశాల నుంచి ఉక్రెయిన్‌కు మద్దతు తగ్గించేందుకు ట్రంప్ ఒత్తిడి చేస్తాడేమో అని భయపడుతున్నారు. విక్టరీ స్పీచ్‌లో భాగంగా ఉక్రెయిన్, రష్యా పేరు ప్రస్తావించకుండానే.. ‘‘యుద్ధాన్ని 24 గంటల్లో ముగిస్తా’’ అంటూ ట్రంప్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఎక్కడ తమపై ఆంక్షలు విధిస్తాడో అన్న భయం వారిలో నెలకొన్నది. ట్రంప్ విజయం.. ప్రపంచ అంతంలా కనిపిస్తున్నదని పలువురు ఉక్రెయిన్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా బలగాలను ఉప సంహరించుకుంటే తమ
పరిస్థితి ఏంటని భయపడ్తున్నారు.