రోజు వారీ పనుల ఒత్తిడి వల్ల శరీరం అలసిపోతుంది. అలాంటప్పుడు స్వీడిష్ మసాజ్ ఆ ఒత్తిడి నుంచి బయట పడేస్తుంది. ఈ మసాజ్ చేస్తే అలసట పోయి కొత్త ఉత్తేజంతో మళ్లీ పనులు ప్రారంభించుకోవచ్చు. ఇలా నెలకి ఒకసారి మసాజ్ చేస్తే ఆరోగ్యమైన, అందమైన శరీరాకృతి సొంతమవుతుంది.
స్వీడిష్ మసాజ్ థెరపీలో వివిధ రకాల నూనెలతో, శరీరానికి వివిధ రకాల స్ట్రోక్స్ ఇస్తూ మర్దనా చేస్తారు. దీనివల్ల మంచి ఆరోగ్య ఫలితాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆరు రకాల ఉపయోగాలున్నాయి.
O పెయిన్ మేనేజ్మెంట్ అంటే శరీర కండరాల్లో కలిగే నొప్పులు నివారించవచ్చు.
౦ రక్త ప్రసరణ క్రమబద్ధమవుతుంది.
• దెబ్బతగలడం వల్ల కలిగిన నొప్పులు మాయమై, కండరాలకు కొత్త శక్తి వస్తుంది.
• శారీరక, మానసిక ఒత్తిళ్లు కూడా దూరం అవుతాయి.
• నరాలు ఉత్తేజితమై, కండరాలు ఎటంటే అంటే అటు సులువుగా వంగుతాయి.
౦ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
ఫోర్టీన్ ఆయిల్స్..
మూమూలుగా అయితే స్వీడిష్ మసాజ్ బాదం నూనెతో చేస్తారు. కానీ దీనిలో దాదాపు 14 రకాల నూనెలను ఉపయోగించొచ్చు. దీనివల్ల శరీరానికి తేమ అందుతుంది. శరీరం పై నల్లని మచ్చలు. చిన్న చిన్న కురుపులు ఉంటే పోతాయి. చర్మం మృదువుగా మారుతుంది. ముఖ్యంగా చర్మం లోపల కణాల ఉత్పతి పెరుగుతుంది.
ఆ పద్నాలుగు నూనెలు:
1. ఆలివ్ నూనె,
2. కొబ్బరి నూనె,
3. స్వీట్ ఆల్మండ్ ఆయిల్,
4. ద్రాక్ష విత్తనాల నూనె,
5. పొద్దుతిరుగుడు పువ్వుల నూనె,
6. ఆర్గాన్ ఆయిల్,
7. పీనట్ ఆయిల్,
8. నువ్వుల నూనె,
9.అవకాడో నూనె,
10. షియా గింజలతో తీసిన వెన్న,
11.జొజోబా ఆయిల్,
12. బిట్టర్ అప్రికోట్ నూనె,
13. దానిమ్మ గింజల నూనె,
14. కుకియా నట్ ఆయిల్.
ఈ నూనెలన్నీ సహజ సిద్ధంగా తయారు చేయడం వల్ల వీటిలో మాయిశ్చరైజర్ గుణం ఎక్కువగా ఉంటుంది. ఇవి పొడి చర్మానికి తేమనిచ్చి మృదువుగా చేస్తాయి. ఇవి కాకుండా 'ఆప్రికాట్ కెర్నల్ నూనె' తో కూడా చేస్తారు. కాని ఇది చాలా ఖరీదు.
ఫైవ్ స్టోక్స్..
చేతివేళ్లతో మర్దనా చెయ్యడం మసాజ్ ప్రధా నమైంది. వీటిని ముఖ్యంగా ఐదు రకాల స్ట్రోక్స్
తో చేస్తారు.
O శరీరాన్ని రెండు చేతి వేళ్లతో మృదువుగా ఒత్తుతారు దీన్ని 'ఎప్లురజ్ స్ట్రోక్' అంటారు.
O పెట్రిసెజ్ స్టోక్లో రెండు చేతుల పిడికిలితో కండరాల పై గుండ్రంగా రుద్దుతారు..
O రెండు చేతులను అర్ధ చంద్రాకారం కండ రాలపై మసాజ్ చెయ్యడాన్ని 'ఫ్రిక్షన్ స్ట్రోక్'
అంటారు..
O చేతి వేళ్లతో శరీరాన్ని చిన్నగా తడుతూ చేసేది 'టాపింగ్ స్టోక్'.
• ఇలా చేతులతో మసాజ్ పూర్తయ్యాక రెండు అరచేతులను శరీరంపై బోర్లా పెట్టి కదుపు తారు. ఇది 'వైబ్రేషన్ మూవ్మెంట్', వైబ్రేషన్ స్ట్రోక్తో మర్దనా పూర్తవుతుంది. ఈ స్ట్రోక్స్ వల్ల రక్తప్రసరణ సజావుగా జరిగి కండరాలు విశ్రాంతి పొందుతాయి. ఒత్తిడి నుంచి బయటపడతారు. దీనివల్ల బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది. నరాల్లో ఉత్తేజం పెరుగుతుంది. ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధులు దరిచేరవు.