
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత తలెత్తింది. డబుల్ బెడ్రూం ఇండ్ల దగ్గర మహిళలు ఆందోళన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి తన అనుచరులకు ఇండ్లు ఇచ్చి.. అర్హులను మోసం చేశారని ఆరోపించారు. ఆందోళనలు చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. స్ధానిక ఎమ్మేల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తీరుపై మహిళలు మండిపడుతున్నారు.