మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో ఉద్రిక్తత.. బాత్‌రూమ్‌లో వీడియోలు తీశారని విద్యార్థినుల ఆగ్రహం

మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో ఉద్రిక్తత.. బాత్‌రూమ్‌లో వీడియోలు తీశారని విద్యార్థినుల ఆగ్రహం

మేడ్చల్‌ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్‌ హాస్టల్‌ బాత్‌రూమ్‌లో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు చిత్రీకరించారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. హాస్టల్‌లో వంట చేసే సిబ్బందిపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆందోళన చేస్తున్నారు. 

విద్యార్థినులు ఆందోళన బాట పట్టిన విషయం తెలుసుకున్న మేడ్చల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.