గాంధీ ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు BRS నేతల ప్రయత్నం.. ఎమ్మెల్యే ఇంటి వద్ద హైటెన్షన్

గాంధీ ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు BRS నేతల ప్రయత్నం.. ఎమ్మెల్యే ఇంటి వద్ద హైటెన్షన్

హైదరాబాద్: శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధిష్టానం పిలుపు మేరకు పెద్ద ఎత్తున అరికెపూడి గాంధీ ఇంటి వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు.. ఒక్కసారిగా ఎమ్మెల్యే ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పక్కనే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు బీఆర్ఎస్ నేతలు నినాదాలు హోరెత్తించారు. 

ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఓ వైపు భారీ పోలీస్ బందోబస్తు.. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల పోటాపోటీ ఆందోళనలతో ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా, పీఎసీ చైర్మన్ వ్యవహారంలో ఎమ్మెల్యే గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. 

Also Read :- కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి

నీ ఇంటికి  వస్తా అంటే నీ ఇంటికే నేను వస్తా అంటూ ఇరువురు సవాళ్లు విసురుకుని రాష్ట్ర రాజకీయాన్ని వేడెక్కించారు. చెప్పినట్లుగానే గురువారం ఎమ్మెల్యే గాంధీ అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డికి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలోనే గాంధీ అనుచరులు, అభిమానులు కౌశిక్ రెడ్డిపై ఇంటిపై దాడి చేశారు. ఈ దాడికి నిరసనగా ఇవాళ (సెప్టెంబర్ 17) ఎమ్మెల్యే గాంధీ ఇంటిని ముట్టడించాలని కేడర్ కు బీఆర్ఎస్ హై కమాండ్ పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.