ఓ వైపు సహాయక చర్యలు.. మరోవైపు బీఆర్‌‌‌‌ఎస్‌‌ లీడర్ల విజిట్‌‌..టన్నెల్‌‌ వద్ద ఉద్రిక్తత

ఓ వైపు సహాయక చర్యలు.. మరోవైపు బీఆర్‌‌‌‌ఎస్‌‌ లీడర్ల విజిట్‌‌..టన్నెల్‌‌ వద్ద ఉద్రిక్తత
  • ఓ వైపు సహాయక చర్యలు.. మరోవైపు బీఆర్‌‌‌‌ఎస్‌‌ లీడర్ల విజిట్‌‌
  • అడ్డుకున్న పోలీసులు.. ఆతర్వాత పర్మిషన్‌‌

ఎస్​ఎల్​బీసీ, వెలుగు టీం: నాగర్‌‌‌‌కర్నూల్‌‌ జిల్లా దోమలపెంట దగ్గర ఎస్‌‌ఎల్‌‌బీసీ టన్నెల్‌‌ వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ వైపు బీఆర్‌‌‌‌ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు టన్నెల్‌‌ విజిట్‌‌ రాగా..మరోవైపు సహాయక చర్యలు కొనసాగాయి. బీఆర్‌‌‌‌ఎస్‌‌ లీడర్లను కాసేపు పోలీసులు అడ్డుకోగా..ఆ తర్వాత టన్నెల్‌‌ పరిశీల నకు పర్మిషన్‌‌ ఇచ్చారు. సహాయక చర్యల్లో భాగంగా ఎస్‌‌ఎల్‌‌బీసీ టన్నెల్‌‌ వద్ద గురువారం ఉదయం ఎనిమిది గంటలకు సహాయక చర్యలు ప్రారంభం అయ్యా యి. ఎనిమిది గంటలకు ఒక టీమ్‌‌ టన్నెల్‌‌లోకి వెళ్లగా, 11 గంటలకు మరో టీమ్‌‌, మధ్యాహ్నం రెండు గంటలకు మూడో టీమ్‌‌ టన్నెల్‌‌లోకి వెళ్లాయి.

టన్నెల్‌‌ వద్ద మినిట్‌‌ టు మినిట్‌‌

మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్‌‌లో జేపీ క్యాంప్‌‌ ఆఫీస్‌‌కు చేరుకున్న మంత్రి ఉత్తమ్‌‌

1.15 నుంచి 1.30 వరకు సహాయక చర్యలపై రెస్క్యూ టీమ్‌‌లతో రివ్యూ

1.55కు దోమలపెంట వద్ద ఎస్‌‌ఎల్‌‌బీసీ గేట్‌‌ -1 వద్దకు చేరుకున్న బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు 

2.03కు లోకో ట్రైన్‌‌ అదనపు బ్యాటరీని ట్రక్‌‌లో తీసుకెళ్లారు.

2.17కు జేపీ ఆఫీస్‌‌ వద్దకు చేరుకున్న బీఆర్‌‌ఎస్‌‌ టీమ్‌‌

2.18కు టన్నెల్‌‌ వద్దకు బయల్దేరిన బీఆర్‌‌ఎస్‌‌ టీమ్‌‌

2.20కి బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లను అడ్డుకున్న పోలీసులు

2.25 గంటలకు ధర్నాకు దిగిన బీఆర్‌‌ఎస్‌‌ నాయకులు

2.30కి అనుమతి రావడంతో టన్నెల్‌‌ వద్దకు బయల్దేరిన బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు

2.35కు టన్నెల్‌‌ వద్దకు అనుమతి ఇవ్వాలని ఆలస్యంగా వచ్చిన బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్సీల ధర్నా

3.40కి తిరిగి జేపీ క్యాంప్‌‌ ఆఫీస్‌‌ వద్దకు చేరుకున్న బీఆర్‌‌ఎస్‌‌ టీమ్‌‌

4.45 గంటలకు మీడియాతో మాట్లాడిన హరీశ్‌‌

4.10కి జేపీ గేట్‌‌ వద్ద బీఆర్‌‌ఎస్‌‌ ధర్నా

4.15కు తిరిగి వెళ్లిపోయిన బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు

5.10కి ఉత్తమ్‌‌ ప్రెస్‌‌మీట్‌‌

5.50కి హెలికాప్టర్‌‌లో తిరిగి వెళ్లిపోయిన ఉత్తమ్‌