సీల్ లేని బ్యాలెట్ బాక్సులు.. బీజేపీ ఏజెంట్ల ఆందోళన

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని సెస్ ఎన్నికల కౌంటింగ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొత్తపల్లి గ్రామ బ్యాలెట్ బాక్స్లు సీల్ లేకుండా ఉన్నాయని ఇండిపెండెంట్ అభ్యర్థి, బీజేపి ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీ జులం నశించాలంటూ  కౌంటింగ్ కేంద్రం వద్ద  ధర్నాకు దిగారు.  పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. 

మరోవైపు రుద్రంగిలో బీఆర్ఎస్ బలపరిచిన ఆకుల గంగారం అనే అభ్యర్థి 36 ఓట్లతో గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థికి 523, స్వతంత్ర అభ్యర్థికి 487 ఓట్లు లభించాయి.