వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత

 వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు కొందరు నేతల యత్నించగా.. కొనిజర్ల మండలం ముఖ్య నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. వారిని కాంగ్రెస్ లోకి చేర్చుకోవద్దంటూ డిమాండ్ చేశారు. కాగా కొనిజర్ల మండల పార్టీ అధ్యక్షుడు వడ్డే నారాయణరావు తీరుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమక్షంలోనే దాడికి యత్నించారు.