![మానుకోట ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య ఉద్రిక్తత](https://static.v6velugu.com/uploads/2025/02/tension-between-mla-vs-former-mla-factions-at-sant-sewalal-temple-on-anantaram-road_86JR3OUFNT.jpg)
- సేవాలాల్ జయంతి నిర్వహణపై ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత
- ఎవరూ వెళ్లకుండా గుడికి లాక్ వేసిన పోలీసులు
- నేడు ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్జిల్లా కేంద్రంలోని అనంతారం రోడ్లో సంత్సేవాలాల్ఆ లయం వద్ద ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వర్గాల మధ్య నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. శనివారం సంత్ సేవాలాల్ మహారాజ్286వ జయంతి సందర్భంగా ఏర్పాట్లు చేసేందుకు శుక్రవారం బీఆర్ఎస్మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తన అనుచరులతో వెళ్లారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్అనుచరులు వెళ్లి నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు.
తమ సొంత భూమిలో గుడిని నిర్మించామని మాజీ ఎమ్మెల్యే తెలపగా.. ప్రభుత్వ నిధులతో అసైన్డ్ భూమిలో కట్టారని కాంగ్రెస్ కార్యకర్తలు పేర్కొన్నారు. మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, టౌన్ సీఐ దేవేందర్ సిబ్బందితో వెళ్లి ఇరువర్గాలను గుడిలోకి వెళ్లకుండా గేటు లాక్ వేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సేవాలాల్వేడుకలు నిర్వహిస్తారని తెలపడంతో ఇరువర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. సేవాలాల్ వేడుకలపై స్థానికంగా ఉత్కంఠత నెలకుంది.