ఇమ్రాన్ఖాన్ మద్దతుదారులపై పాక్ ఆర్మీ కాల్పులు

పాకిస్తాన్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఉద్రికత నెలకొంది. పాక్ ఆర్మీరిగ్గింగ్ కు పాల్పడిందని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ)  మద్దతుదారులపై ఆందోళనలకు దిగారు. దీంీతో పాక్ ఆర్మీకాల్పులు జరపడంతో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది.

ALSO READ :- చంద్రబాబు క్విట్ ఏపీ నినాదం రావాలి : లక్ష్మీపార్వతి

మరొకొందరికి తీవ్ర గాయాలయ్యాయి.పాక్ ఆర్మీ రిగ్గింగ్ కు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. కౌంటింగ్ సందర్భంగా పాక్ ఆర్మీ రిగ్గింగ్ కు పాల్పడిందని దేశవ్యాప్తంగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆందోళన చేపట్టగా.. చెదరగొట్టేందుకు కాల్పులు జరిపినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. 

పాకిస్తాన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఫిబ్రవరి 9 తెల్లవారు జాము వరకు ఫలితాలను వెల్లడించాల్సి ఉండగా.. మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయితే ఎన్నికల ఫలితాలను తారుమారు చేయసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, పీటీఐ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
 
ఎన్నికల ముందు రిగ్గింగ్, అణచివేత సంఘటనలు జరిగాయని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. అయితే ప్రజలు తమ వెంటే ఉన్నారని పీటీఐ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగానే వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.