వీఆర్ఏల వారసుల ఆందోళన ఉద్రిక్తం

వీఆర్ఏల వారసుల ఆందోళన ఉద్రిక్తం

జూబ్లీహిల్స్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మంగళవారం వందల మంది వీఆర్ఏల వారసులు బంజారాహిల్స్ లోని మినిస్టర్  క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, వీఆర్ఏల వారసుల మధ్య తోపులాట జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీవో నంబర్ 81 ప్రకారం 61 ఏండ్లు పైబడిన వీఆర్ఏల ఉద్యోగాలను వారసులకు ఇవ్వాలన్నారు. 2020 సెప్టెంబరులో గత ప్రభుత్వం వీఆర్ఏలకు పేస్కేల్, వారసులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. కాగా, ఆందోళన చేసిన వారిలో 262 మందిని అరెస్ట్ చేసి బొల్లారం, బోయినపల్లి, ఎస్సార్​నగర్, కార్ఖానా, కంచన్ బాగ్ పోలీస్ ​స్టేషన్లకు తరలించారు.