
బెంగళూరు ప్రజల్లో టెన్షన్ మొదలైంది. సాక్షత్ ఉపముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ‘‘బెంగళూరును ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు’’ అంటూ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ప్రజలు అయోమయానికి గురికాగా.. తాజాగా కర్ణాటక హోమ్ మినిస్టర్ జి.పరమేశ్వర చేసిన స్టేట్ మెంట్స్ ప్రజలను గందరగోళానికి గురిచేస్తు్నాయి. ఉన్నట్లుండి మంత్రులు ఈ స్థాయిలో కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది.. బెంగళూరు ప్రజల్లో నెలకొన్న భయాలకు కారణం ఏమిటి.. లెట్స్ రీడ్.
బెంగళూరులో పాపులేషన్ రోజు రోజుకూ పెరిగి పోతోంది. ప్రస్తుతం అత్యంత ట్రాఫిక్ జామ్ అయ్యే నగరాలు ఏవంటే బెంగళూరు టాప్ 3 లో ఉంటుంది. ఆఫీస్ వేళల్లో బెంగళూరు రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ట్రాఫిక్ క్లియర్ చేయలేక అధికారుల తల ప్రాణం తోకకు వచ్చినంత పని అవుతుంటుంది.
కొన్నాళ్లు ఐటీ రాజధానిగా పేరు సంపాదించుకున్న బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఇండివిడ్యువల్ వెహికిల్స్ వినియోగం కూడా ఎక్కువే. ఆఫీస్ వేళ్లలో ప్రతి ఒక్కరూ సొంత వెహికిల్స్ తో రోడ్లపైకి ఎక్కుతుంటారు. టూ వీలర్ కంటే కార్లు ఎక్కువగా రోడ్లెక్కడంతో ట్రాఫిక్ జాం కష్టాలు ఎక్కువయ్యాయి. దాదాపు కోటి 20 లక్షలపైచిలుకు జనం ఉన్న ఈ నగరంలో ట్రాఫిక్ కష్టాలు ఇప్పుడు ప్రజలకూ, ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది.
ALSO READ | ట్యాక్స్ బకాయిలు: జూబ్లీహిల్స్ లాండ్ మార్క్ ప్రాజెక్ట్ రూ.52 కోట్లు..హైద్రాబాద్ ఆస్బెస్టాస్ రూ.30 కోట్లు
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు అధికారులతోపాటు మంత్రులకూ చికాకు తెప్పిస్తు్న్నాయి. రోజు రోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్, మెట్రో విస్తరణ జరగక పోవడం, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సరిగా లేకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తు్న్నాయి. అయితే శుక్రవారం (ఫిబ్రవరి 21) జరిగిన రోడ్ కన్ స్ట్రక్షన్ వర్క్ షాప్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లయినా.. ఇంకా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ తీరటం లేదని ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా ‘‘బెంగళూరు రోడ్డు విస్తరణ పూర్తి కావాలంటే సరైన ప్లానింగ్ తో వెళితే ఇంకో రెండేళ్లు పడుతుంది. ప్లానింగ్ సరిగా అమలు చేయలేకపోతే బెంగళూరును ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు’’ అని అన్నారు.
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కామెంట్స్ చేసిన 24 గంటల్లోనే హోంమంత్రి అదే తరహా వ్యాఖ్యలు చేయడం ప్రజల్లో ఆందోళన రేకెత్తించింది. ‘‘బెంగళూరు రోడ్లు, ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ ఇప్పుడున్న ఇంతమంది ప్రజల కోసం ఏర్పాటు చేసింది కాదు.. ఇక్కడ 1.4 కోట్ల ప్రజలు ఉంటే.. 1.4 కోట్ల వెహికిల్స్ ఉన్నాయి. ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ చేయలేకపోతే ట్రాఫిక్ సమస్యలు ఇంకెప్పటికీ తీర్చలేం’’అని అన్నారు. ట్రాఫిక్ సమస్యలనుంచి బెంగళూరును బయట పడేసేందుకు ప్రభుత్వం కొత్త మార్గాలు అన్వేషిస్తోందని, అండర్ గ్రౌండ్ మార్గాలు కూడా అందులో భాగమేనని అన్నారు.
ఈ విషయంలో హైదరాబాద్ బెటర్..?
హైదరాబాద్ లో కూడా బెంగళూర్ లాగే అత్యధిక జనాభా ఉంటుంది. దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ ను సేఫెస్ట్ ప్లేస్ గా భావిస్తుంటారు. ఇప్పటికే హైదరాబాద్ జనాభా కోటి దాటింది. రాజస్థాన్, గుజరాత్, యూపీ, బీహార్ ఇలా నార్త్ ఇండియన్స్ తో పాటు ఒడిశా, కర్ణాట, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ఇలా దక్షిణాది రాష్ట్రాల ప్రజలూ ఇక్కడ పలు ఉపాధి పనుల కోసం వచ్చి నివసిస్తున్నారు.
అయితే ట్రాఫిక్ విషయంలో బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్ బెటర్ అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. మెట్రో సేవలు అందుబాటులో ఉండటం, భవిష్యత్తును ఊహించి ఫ్లై ఓవర్లు, రోడ్ల విస్తరణ కార్యక్రమాలు ముందుగానే చేపట్టడంతో ట్రాఫిక్ నియంత్రణలో హైదరాబాద్ కాస్త బెటర్ ప్లేస్ లో ఉంది. కానీ రానున్న రోజుల్లో హైదరాబాద్ కు వలసలు మరింగా పెరుగుతాయని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా గ్రేటర్ ను తీర్చిదిద్దాలనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.
ప్రభుత్వం కూడా భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసింది. మెట్రో విస్తరణ చేపట్టింది. అదే విధంగా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసి సిటీని కేంద్రీకృతం కాకుండా చేయాలనే ప్లాన్ లో ఉంది. ఇప్పటికే ఓఆర్ఆర్ ఉండగా.. ఫ్యూచర్ అవసరాల దృష్ట్యా రీజనల్ రింగ్ రోడ్డు ‘ఆర్ఆర్ఆర్’ పనులు కూడా సిద్ధం చేసింది. ఏదేమైనా.. భవిష్యత్తులో బెంగళూర్, ఢిల్లీ పరిస్థితి రాకుండా ఉండేందుకు హైదరాబాద్ ను మరింత వేగంగా ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది.