ఖమ్మం జిల్లా బాజిమల్లాయి గూడెంలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా జరిగిన పేలుడులో  మృతి చెందిన వారి డెడ్ బాడీలు స్వగ్రామం చీమలపాడు పంచాయతీ, బాజిమల్లాయిగూడానికి తరలించారు అధికారులు.  అయితే  మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఊళ్లోకి రానివ్వకుండా అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు.   రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.   ప్రభుత్వం నష్టపరిహరం ఇచ్చే వరకు అంత్యక్రియలు చేయనివ్వబోమని తేల్చి చెప్పారు.  దీంతో పోలీసులు భారీగా మోహరించారు.

ఖమ్మం జిల్లా కారేపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన కొద్దీ దూరంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.  దాదాపు 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్. మరణించిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరపున రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల రూపాయల  ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.  ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు వ్యక్తిగతంగా  రూ. 2 లక్షలు, గాయాలైన వారికి రూ. 50 వేలు ప్రకటించారు.