చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో కరీంనగర్ బీజేపీ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి్ బండి సంజయ్ బస చేసిన ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బండి సంజయ్ ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చారు. వారిని అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు కూడా తరలివచ్చారు. ఈ క్రమంలో డౌన్ డౌన్, గో బ్యాక్ సంజయ్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో అక్కడి పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు.
మరోవైపు బండి సంజయ్ ప్లెక్సీలపై కాంగ్రెస్ కార్యకర్తలు వ్యతిరేకంగా రాతలు రాయడం కలకలం రేపింది. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేద్కర్ కూడలిలో ఇవాళ బండి సంజయ్ పాదయాత్ర జరగనుంది. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు రహదారుల్లో సంజయ్ కు స్వాగతం పలుకుతూ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వాటిపై బండి సంజయ్ కాదు సన్నాసి అని కాంగ్రెస్ నాయకులు రాతలు రాయడం కలకలం సృష్టించింది.
ALSO READ : కాంగ్రెస్ గూటికి ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు