యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి ఫైళ్ల శేఖర్ రెడ్డి కూతురు మన్విత రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 3,4వ వార్డుల్లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ.. ఆయన కూతురు పైళ్ల మన్విత ఇంటింటి ప్రచారం చేశారు. పైళ్ల శేఖర్ రెడ్డికి ఓటు వేయాలని ఆమె కోరారు.
కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా పైళ్ల శేఖర్ రెడ్డిని గెలిపించాలని ఆకాంక్షించారు. ఇంటింటికి తిరుగుతూ.. శేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ.. మా నాన్నని గెలిపించాలని కోరారు.
Also Read :- జనసేనకు కూకట్ పల్లి టికెట్.. బీజేపీ నేత అసహనం
ఈ క్రమంలో RRR బాధితులు మన్వత ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమకు అన్యాయం జరిగిందని.. న్యాయం కావాలని.. గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో మన్వితతో పాటు ప్రచారానికి వచ్చిన బీఆర్ఎస్ లీడర్లకు, RRR బాధితులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో రాయగిరిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.