రంగారెడ్డి జిల్లా దుండిగల్ ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు, మర్రి రాజశేఖర్ రెడ్డి సెక్రటరీగా వ్యవహరిస్తున్న ఎంఎల్ఆర్ఐటీ కాలేజీ వద్ద హైటెన్షన్ నెలకొంది. చెరువు భూములు కబ్జా చేసి కాలేజీ కట్టారని ఎంఎల్ఆర్ఐటీలో అధికారులు కూల్చి వేతలు చేపట్టారు. కాలేజీలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు కూల్చివేతను అడ్డుకున్నారు. పలువురు విద్యార్థులు కాలేజీ భవనం పైకి ఎక్కి నినాధాలు చేశారు. కూల్చివేతలు ఆపాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మొహరించారు. విద్యార్థులకు, ఉపాద్యాయులకు నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అసలేం జరిగిందటే..
గతంలో చిన్నదామర చెరువులో ఎరోనాటికల్, MLRIT కళాశాలలో స్థలాలు ఆక్రమించినట్లుగా ఫిర్యాదులు రావడంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతం అధికారులతో కలిసి స్థలాలను పరిశీలించారు. ఆక్రమణలు ఉన్నట్లు నిర్ధారించిన కలెక్టర్ అధికారులకు కూల్చివేతలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ గౌతం ఆదేశాలతో గండిమైసమ్మ మండల రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులు. ఈరోజు తెల్లవారుజాము నుంచే భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు.