ఫార్మా విలేజ్ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత

ఫార్మా విలేజ్ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత
  • మా భూములు ఇయ్యం
  • కాంగ్రెస్​ నాయకుడిపై దాడి, కారు ధ్వంసం

కొడంగల్, వెలుగు: ఫార్మా విలేజ్ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత నెలకొంది. కొడంగల్ నియోజకవర్గంలోని పోలేపల్లి, లగచర్ల, హకీంపేట, రోటిబండ తండా ప్రాంతంలో ఇండస్ట్రియల్​కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం భూసేకరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు శనివారం వెళ్లగా.. తమ భూములు ఇచ్చేది లేదంటూ అక్కడి రైతులు ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలో అక్కడకు వచ్చిన దుద్యాల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శేఖర్ కారును ధ్వంసం చేసి ఆయనపై దాడికి యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. వికారాబాద్​ ఎస్పీ నారాయణరెడ్డి, అడిషనల్​కలెక్టర్​ లింగ్యానాయక్ ఘటనాస్థలానికి చేరుకొని​ రైతులతో మాట్లాడారు. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోవద్దని, సమస్య ఉంటే పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు. గతంలో తమ పట్ల అనుచితంగా ప్రవర్తించి దుద్యాల కాంగ్రెస్ మండల అధ్యక్షుడిపై ఎస్పీకి రైతులు ఫిర్యాదు చేశారు.