- ఇమ్మిర్సెన్ బోర్డులు, కంచెలు తొలగించిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు
హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. ట్యాంక్ బండ్ పై నో ఇమ్మిర్సెన్ బోర్డులు, కంచెలు తొలగించారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. ట్యాంక్ బండ్ పై అన్నిరకాల గణేష్ ల నిమజ్జనానికి ఆటంకం కల్గించొద్దన్నారు.
నిమజ్జనం ఏర్పాట్లను GHMC సహా పోలీసులు చూడాలన్న గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు..భక్తుల విశ్వాసాలను అడ్డుకోవద్దన్నారు. ట్యాంక్ బండ్ పై విగ్రహాల నిమజ్జనానికి అడ్డుతగిలితే...నగరంలోని విగ్రహాలన్నీ అక్కడికే చేరుకుంటాయని హెచ్చరించారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. దీనిపై మరిన్ని వివరాలు రత్నకుమార్ అందిస్తారు.
ALSO READ : నిమజ్జనం తర్వాత చూసుకుందాం.. ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం స్వీట్ వార్నింగ్