నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత

 నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత

వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బుధవారం రాత్రి చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో దంపతులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వారి డెడ్ బాడీలకు నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతోంది. మార్చురీ దగ్గరకు భారీగా చేరుకున్నారు బంధువులు. అవాంఛీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. బాధితులకు న్యాయం చేయాలంటూ మార్చురీ దగ్గర బంధువులు ఆందోళన దిగారు.

మార్చురీ దగ్గర మృతుల బంధువుల ఆర్తనాథాలు మిన్నంటాయి. మరోవైపు డబుల్ మర్డర్ కేసులో పోలీసులు విచారణ కొనసాగుతోంది. ఉన్మాది దాడిలో గాయపడిన దీపిక, ఆమె సోదరుడికి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.  నిందితుడు నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదే ఊరులో ఉన్న నాగరాజు స్నేహితులు హత్యకు సహకరించాడని బాధితుల బంధువులు వారిపై దాడికి యత్నించారు. పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు.