- టికెట్ కోసం ఆశావహుల పైరవీలు
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో కాంగ్రెస్ లీడర్లకు అసెంబ్లీ టికెట్ల టెన్షన్పెరిగింది. దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రతీ నియోజకవర్గం నుంచి ముగ్గురి పేర్లను స్టేట్కమిటీ ఏఐసీసీకి పంపారు. ఈ లిస్టులో ఎవరి పేర్లు ఉన్నాయో తెలుసుకునేందుకు బడా నేతలను సంప్రదిస్తున్నారు.
అర్బన్‌లో అంతా ఉద్దండులే..
జిల్లాలో అత్యధికంగా అర్బన్ నుంచి 12 మంది టికెట్ఆశిస్తున్నారు. టికెట్‌కు పోటీ ఎక్కువగా ఉండడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇక్కడ బీసీ సామాజికవర్గానికి సర్దుబాటు చేసే అవకాశాలు ఉండగా, పోటీ కూడా తీవ్రంగానే ఉంది. బీఆర్ఎస్, బీజేపీకి ధీటైన అభ్యర్థిని బరిలో నిలపాలని పార్టీ భావిస్తోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్మహేశ్గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మాజీ మేయర్డి.సంజయ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మైనార్టీ కోటా కింద ఇవ్వాల్సి వస్తే, టీపీసీపీ ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్‌కు టికెట్దక్కొచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ పరిశీలన ఎలా ఉన్నా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న లీడర్లంతా పార్టీ పెద్దల ద్వారా టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆర్మూర్‌లో తక్కువేమీ కాదు..
ఆర్మూర్‌లో గెలుపునకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి సమర్థుడైన క్యాండిడేట్‌ను బరిలో నిలపాలని అధిష్టానం యోచిస్తోంది. ఆర్మూర్ టికెట్‌కోసం పది మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు.ఇటీవల పార్టీలో చేరిన వినయ్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్(చిన్నా),
మహిళా కోటాలో జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోదరి వేముల రాధికారెడ్డి పేర్లను స్టేట్కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా గ్రంథాలయ కమిటీ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్, జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు గోర్త రాజేందర్ కూడా టికెట్‌పై ఆశతో ఉన్నారు.
రూరల్‌పై భారీగా కసరత్తు..
రూరల్ నియోజకవర్గం నుంచి ఏడుగురు పోటీపై ఆసక్తితో ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీలు డాక్టర్ భూపతిరెడ్డి, అరికెల నర్సారెడ్డి, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్నగేశ్రెడ్డి పేర్లు హస్తినకు చేరినట్లు సమాచారం.
బోధన్ నుంచి రెండు పేర్లు..
బోధన్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి రెండు పేర్లను స్టేట్ లీడర్లు హైకమాండ్‌కు పంపారు. గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మూడు సార్లు ఓడిన సుదర్శన్‌రెడ్డి తనకే టికెట్ వస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నారు.
ఇప్పటికే రెండు సార్లు నియోజకవర్గంలో పోటీ చేసిన కెప్టెన్కరుణాకర్రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్న స్టేట్లీడర్లూ ఉన్నారు. వీరిద్దరి మధ్య రాజీకుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
బాల్కొండ నుంచి ర్యాంకింగ్ ఆధారంగా..
పార్టీ గతంలో నిర్వహించిన మూడు సర్వే రిపోర్టులు, కర్నాటక నుంచి వచ్చిన పార్టీ లీడర్ అంతరంగిక నివేదిక ఆధారంగా బాల్కొండ సెగ్మెంట్ నుంచి ముగ్గురి పేర్లను హైకమాండ్‌కు పంపారు. లిస్ట్‌లో ఆరెంజ్ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్‌రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.