- ట్రిపుల్ఐటీలోకి చొచ్చుకుపోయేందుకు యత్నం
- అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది
- కార్యకర్తలు, సెక్యూరిటీ మధ్య తోపులాట
భైంసా: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఉదయం ట్రిపుల్ ఐటీలో పీయూసీ సెకండ్ఇయర్ చదువుతున్న స్వాతి ప్రియ అనే విద్యార్థిని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఏబీవీపీ కార్యకర్తలు ట్రిపుల్ ఐటీ లోకి చొచ్చుకుపోయేందుకు యత్నించారు. అక్కడే డ్యూటీ చేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు.
దీంతో ఇరువురి మధ్య తోపులాట జరుగగా..ఏబీవీపీ కార్యకర్తపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేసింది.ఏబీవీపీ కార్యదర్శి సాయికుమార్ అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా భైంసా ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రభుత్వానికి, ట్రిపుల్ ఐటీ అధికారులకు వ్యతిరేకంగా ఏబీవీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రిపుల్ ఐటీ మెయిన్ గేటు ముందు ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన కొనసాగుతుంది.