- హరీశ్ రాజీనామా చేయాలని ఫ్లెక్సీలు
- వాటిని చించేసిన బీఆర్ఎస్ లీడర్స్
- సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై దాడి
- కేసీఆర్ ఫ్లెక్సీని చించేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
- సీఎం రేవంత్ ఫ్లెక్సీ ఏర్పాటుకు కాంగ్రెస్ యత్నం
- ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్ లీడర్లను అరెస్టు చేసిన పోలీసులు
- ఎమ్మెల్యే నివాసంపై దాడి జరిగితే సామాన్యుల పరిస్థితి ఏమిటి: ట్విట్టర్ లో హరీశ్ రావు
సిద్దిపేట: జిల్లా కేంద్రంలో నిన్న అర్ధరాత్రి నుంచి టెన్షన్ వాతావరణం నెలకొంది. రూ. రెండు లక్షల రుణమాఫీని పంద్రాగస్టులోపు అమలు చేసినందన హరీశ్ రావు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని బీఆర్ఎస్ నేతలు చించివేసేందుకు యత్నించగా కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు.
క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. బీఆర్ఎస్ నాయకులను పోలీసు స్టేషన్ కు తరలించారు. ఇదిలా ఉండగా.. అర్ధరాత్రి దాటాక కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై దాడి చేశారు. క్యాంప్ ఆఫీసు బయట ఉన్న కేసీఆర్ ఫ్లెక్సీలను చించివేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
తో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి పూట కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం బాధాకరమని చెప్పారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం శోచనీయమని చెప్పారు. ఒక ఎమ్మెల్యే అధికారిక నివాసంపైనే ఈ తరహా దాడి జరిగిందంటే సామాన్యుల పరిస్థితి ఏమిటన్నారు.
లీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనం. వెంటనే ఈ ఘటనపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీఎం ఫ్లెక్సీతో క్యాంప్ ఆఫీసుకు కాంగ్రెస్
ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ ఫ్లెక్సీని తీసుకొని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు బయల్దేరారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ పదవి కోల్పోయి 8 నెలలు గడిచినా ఆయన ఫ్లెక్సీని ఎమ్మెల్యే అధికారిక నివాసంలో ఏర్పాటు చేయడం ఏమిటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ర్యాలీగా వెళుతున్న సిద్దిపేట కాంగ్రెస్ ఇంచార్జ్ పూజల హరికృష్ణతో పాటు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ వాహనంలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీంతో సిద్దిపేటలో ఫ్లెక్సీల వార్ మరింతగా హీట్ పెంచింది.