అంబటిపల్లి గ్రామంలో కాంపౌండ్​ వాల్​ కూల్చివేతతో ఉద్రిక్తత

అంబటిపల్లి గ్రామంలో కాంపౌండ్​ వాల్​ కూల్చివేతతో ఉద్రిక్తత

లింగాల, వెలుగు: అక్రమంగా కట్టిన కాంపౌండ్​వాల్​ను పోలీసు బందోబస్తు నడము రెవెన్యూ అధికారులు శనివారం తెల్లవారుజామున కూల్చి వేయడంతో మండలంలోని అంబటిపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అంబటిపల్లి అసైన్డ్  భూమి సర్వే నంబర్ 732లో 5 ఎకరాల 29 గుంటల భూమి ఉంది. పీఏసీఎస్​ చైర్మన్  తన ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం కొనుగోలు చేసి అందులో కాంపౌండ్  వాల్​  నిర్మించడం వివాదాస్పదంగా మారింది.

 గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఈ నెల 18న సర్వేయర్లు సర్వే చేసి ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించి మార్కింగ్  చేశారు. ఈ నెల 20న కాంపౌండ్​ వాల్​ను కూల్చివేయడానికి ప్రయత్నించగా, పీఏసీఎస్​ చైర్మన్​ హన్మంత్ రెడ్డి, ఆయన తండ్రి వెంకట్ రెడ్డి, కొందరు గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో తహసీల్దార్  పాండు నాయక్, ఆర్ఐ సీతారాం పర్యవేక్షణలో ప్రహారీగోడను కూల్చివేశారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడమేమిటని పీఏసీఎస్​ చైర్మన్​ ప్రశ్నించారు.