
తెలంగాణ వ్యాప్తంగా అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా వేం సూరు మండలం కుంచపర్తి .. సత్తుపల్లి మండలంలోని కిష్టారం, సిద్దారం గ్రామాల్లో జరిగిన సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనర్హులను ఇళ్ల లబ్ధిదారులుగా ప్రకటించారు అంటూ ప్రజలు,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మళ్ళీ సర్వే చేసి లబ్ధిదారులను గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.