మహబూబాబాద్ జిల్లా కురవిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గ్రానైట్ ప్రమాదం జరిగిన స్థలంలో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాలతో నిరసనకు దిగారు. నిన్న సాయంత్రం కురవి దగ్గర టిప్పర్ లారీ నుంచి గ్రానైట్ బండరాయి ఆటో మీద పడటంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ప్రమాదంలో తమ కుటుంబాలకు పెద్దదిక్కులాంటి వారిని కోల్పోయామని, తమకు న్యాయం చేయాలంటూ మృతుల కుంటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 365వ జాతీయ రహదారిపై మహబూబాబాద్ - మరిపెడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిరసనను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో.. మృతుల కుటుంబ సభ్యులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.