
ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాల్లో సోమవారం ( మార్చి 17) టీడీపీ .. వైసీపీ వర్గాల్లో మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీస్ స్టేషన్ సెంటరులో వైసీపీ నేతలకు చెందిన ప్రభ బండ్లను ఆపి.. టీడీపీ వారి ప్రభ బండ్లను పంపడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో దేవుడి ఉత్సవాల్లో కూడ రాజకీయం చేస్తున్నారని కొంతమంది పోలీసులపైకి రాళ్లు రువ్వారు.
ఈ ఘటనలో ఒక ఏఎస్ఐ, నలుగురు కానిస్టేబుల్స్ కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం దాడికి పాల్పడిన వారిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రోజున ( మార్చి 18)న పెనుగంచి ప్రోలులో భారీగా పోలీసులు మోహరించారు. గుంపులు.. గుంపులుగా తిరగవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.