- కారు దిగిన నేతలకు బీజేపీ టికెట్
- గులాబీ ఓట్లు చీల్చుతారనే ఆందోళన
నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పాత నేతల్లో టెన్షన్మొదలైంది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లు మాజీ బీఆర్ఎస్ లీడర్లే కావడం ఆ పార్టీకి కంటిమీద నిద్రలేకుండా చేస్తోంది. బీఆర్ఎస్ ఇద్దరు ఎంపీ అభ్యర్థులు జిల్లా రాజకీయాలకు కొత్తవారు కాగా, బీజేపీలో చేరిన ఇద్దరు బీఆర్ఎస్ నేతల్లో ఒకరు మాజీ ఎంపీ కాగా, మరొకరు మాజీ ఎమ్మె ల్యే ఉన్నారు.
దీంతో ఈ ఎన్నికల్లో గెలుపోటములు సంగతి పక్కన పెడితే పార్టీ ఓట్లు చీలిపోకుండా ఉండేందుకే తంటాలు పడుతున్నారు. పార్టీలో గ్రూపు తగాదాలతో క్యాడర్ చల్లాచెదురువుతోంది. ఎంపీ ఎన్నికల తర్వాత లోకల్‌బాడీ నోటిఫికేషన్ వస్తదని ప్రభుత్వం సంకేతాలు ఇవ్వడంతో బీఆర్ఎస్ లీడర్లు మెల్లగా జారుకుంటున్నారు. పార్టీ క్యాడర్జారిపోకుండా మాజీ ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రయత్నాలు కూడా వర్క్‌వుట్ కావట్లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ట్రయాంగిల్ వార్తమకు కలిసి వస్తుందని నమ్ముకుని మాజీ ఎమ్మెల్యేలు బోల్తాపడ్డారు. ఇప్పుడు కూడా అదే సీన్రిపీట్ అవుతుందేమోనని భయపడుతున్నారు.
పార్టీ ఓటర్ల పైనే ఫోకస్..
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఘోరంగా ఓడిపోయారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాత్రం స్వల్ప ఓట్లతో గట్టెక్కారు. ఈ ఎన్నికల్లో ఓటర్లను కాపాడుకోవడంపైనే పార్టీ ఫోకస్పెట్టింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం బీజేపీకి ఆదరణ పెరిగిందని బీఆర్ఎస్ అంతర్గత మీటింగ్‌లో చర్చ నడుస్తోంది. దీంతోనే కేటీఆర్, హరీశ్‌రావు సైతం బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడి చేస్తున్నారు. కానీ, జిల్లాలో మాత్రం కాంగ్రెస్ లీడర్లు, ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఇదంతా పైకి కనిపించే తతంగం తప్ప.. లోపల మా త్రం బీజేపీ భయం వెంటాడుతోంది.
ఇద్దరు క్యాండిడేట్లు బీఆర్ఎస్ నుంచి వలసపోయిన వాళ్లే కావడంతో తమ పార్టీ ఓటర్లు బీజేపీ వైపు టర్న్అవుతురేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగానే భువనగిరిలో బీజేపీకి కౌంటర్‌గా బీఆర్ఎస్సైతం బీసీ క్యాండిడేట్‌ను బరిలో దింపింది. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పైనే బీసీ సెంటిమెంట్బలంగా పనిచేస్తుందని బీఆర్ఎస్ లీడర్లే బయటకు చెబుతున్నారు. గౌడ ఓటర్లు బలంగా ఉండటం ఒక ఎంతైతే.. క్యామ మల్లేశ్జిల్లాకు కొత్త కావడం మైనస్ అని భావిస్తున్నారు.
నాడు బీజేపీ ‘ట్రైయాంగిల్’ ఎత్తులు పారలే..
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై బీఆర్ఎస్ నమ్మకం పెట్టుకుంది. జిల్లాలో ముక్కోణపు పోటీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ వ్యతిరేకత ఓటు చీలిపోతే బీఆర్ఎస్కే కలిసి వస్తుందని చాలా మంది ఎమ్మెల్యేలు భావించారు. ముఖ్యంగా సూర్యాపేట, ఆలేరు, తుంగతుర్తి, నల్గొండ, భువనగిరి, మునుగోడు, దేవరకొండపై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. బీజేపీ అభ్యర్థులు తీరా ఎన్నికల టైంలో సైలెంటయ్యారు.
దీంతో బీజేపీకి ఎక్కడ కూడా డిపాజిట్దక్కలేదు. ఈ తరహా ఆపరేషన్ ఒక్క సూర్యాపేటలో మాత్రమే సక్సెస్అయ్యింది. 40 వేలకు పైగా ఓట్లు బీజేపీకి రావడంతో కాంగ్రెస్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్అయ్యింది. బీజే పీ బలపడిందని బీఆర్ఎస్ లీడర్లే ఒప్పుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్‌ను దెబ్బ తీయడం సంగతి పక్కన పెడితే బీఆర్ఎస్ ఓటర్లు బీజేపీ వైపు చీలిపోకుండా కా పాడుకునేందుకే ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది.