ఖమ్మం: సిటీలోని కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాయి గణేశ్ ఆత్మహత్యపై బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సాయి గణేశ్ మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ర్యాలీ చేపట్టిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అనంతరం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల తీరుపై బీజేపీ నేతలుమండిపడుతున్నారు. సాయి గణేశ్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా ఆందోళన నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేయడం ఏంటని వారు ప్రశ్నించారు.
మరిన్ని వార్తల కోసం..