నిర్మల్​ ఆర్డీవోను నిర్భంధించారు.. కలెక్టర్​ వస్తే వదిలేస్తామంటున్న ఆందోళనకారులు

నిర్మల్​ ఆర్డీవోను నిర్భంధించారు.. కలెక్టర్​ వస్తే వదిలేస్తామంటున్న ఆందోళనకారులు

నిర్మల్​ ‌‌ భైంసా రహదారిపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది.   దిలావర్పూర్​ మండలం.. గుండవపల్లి గ్రామాల మధ్య ఇథనాల్​ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ధర్నా రెండో రోజుకు చేరింది.  ప్రస్తుతందిలావర్ పూర్ లో టెన్షన్ వాతావరణం ఉండటంతో భారీగా పోలీసులు మోహరించారు.  ఈ ఫ్యాక్టరీ ఇక్కడ వద్దని... మరో ప్రదేశానికి తరలించాలని స్థానికులు ఆందోళన చేశారు.  

ఆందోళనకారులతో చర్చించేందుకు ఆర్డీవో రత్న కళ్యాణి రాగా... మహిళా అధికారిని కారులోనే నిర్భంధించారు.  కలెక్టర్​ రావాలని డిమాండ్​ చేస్తూ ఇక్కడ ఇథనాల్​ ఫ్యాక్టరీ పెట్టమని స్పష్టమైన హామీ ఇస్తేనే ఆర్డీవోను వదలిపెడతామని దిలావర్పూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆర్డీవోను పోలీసుల సాయంతో పంపేందుకు ప్రయత్నం చేయగా ..ఆందోళనకారులు ఆర్డీవో కారు అద్దాలు పగలగొట్టి ధ్వంసంచేశారు. ఈ  తరువాత పోలీస్​ వాహనంలో ఆర్డీవోను తరలించారు.  ఆందోళనకారులు సంయమనం పాటించి.. ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఎస్పీ జానకి షర్మిల సూచించారు.