ఇండియన్ నేవీ టెన్త్, ఇంటర్ విద్యార్హతలతో ప్రతి ఆరు నెలలకోసారి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తోంది. తాజాగా 2800 సెయిలర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. వీటిలో సీనియర్ సెకెండరీ రిక్రూట్ (ఎస్‌ఎస్‌ఆర్) 2000, ఆర్టిఫీసర్ అప్రెంటీస్ (ఏఏ) 500, మెట్రిక్ రిక్రూట్ (ఎంఆర్) 300 ఖాళీలు ఉన్నాయి. ఏ విభాగంలో సెలెక్ట్ అయినా మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ లెవెల్ కు చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ ప్యాటర్న్, సెలెక్షన్ ప్రాసెస్, కెరీర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
నాన్ ఆఫీసర్ పోస్టులైన మెట్రిక్ రిక్రూట్, ఎస్‌ఎస్‌ఆర్, ఏఏ పోస్టుకు జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహించినా రాష్ట్రాలవారీగా కేటాయించిన ఖాళీల ప్రకారం భర్తీ జరుగుతుంది. కేవలం పదో తరగతి విద్యార్హతతో మెట్రిక్ ఎంట్రీలో భాగంగా షెఫ్, స్టివార్డ్, హైజీనిస్టులకు పోటీ పడవచ్చు. ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు ఎస్‌ఎస్‌ఆర్, ఏఏ రెండు పోస్టులకూ అర్హులే. ఆసక్తి ఉన్నవారు ఈ రెండు పోస్టులకూ కలిపి పరీక్ష
రాసుకోవచ్చు.
అర్హతలు
మెట్రిక్ రిక్రూట్ (ఎంఆర్): అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత. 1 ఏప్రిల్ 2002-31 మార్చి 2005 మధ్య జన్మించి ఉండాలి.
సీనియర్ సెకెండరీ రిక్రూట్ (ఎస్‌ఎస్‌ఆర్): ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్‌లో ఏదో ఒక సబ్జెక్టు చదవాలి.
ఆర్టిఫిసర్ అప్రెంటిస్ (ఏఏ): ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/ బయాలజీలో ఏదో ఒక సబ్జెక్ట్ చదివుండాలి.
ఎస్‌ఎస్‌ఆర్, ఏఏ రెండు పోస్టులకూ 2002- 2005 మధ్య జన్మించి ఉండాలి. మూడు పోస్టులకూ అవివాహిత పురుషులే అర్హులు.
సెలెక్షన్ ప్రాసెస్
ఏ విభాగానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు (పీఎఫ్‌టీ), ప్రాథమిక వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. కొవిడ్ నేపథ్యంలో మెట్రిక్ రిక్రూట్ (ఎంఆర్) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి వాళ్లు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం, ఆయా రాష్ట్రాల కోటా అనుసరించి 1500 మందిని పరీక్ష రాయడానికి ఎంపికచేస్తారు. అలాగే ఎస్‌ఎస్‌ఆర్, ఏఏ పోస్టులకు పదివేల మందికి పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్: అర్హత సాధించిన వారికి పీఎఫ్‌టీ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల్లో పరుగెత్తాలి. పీఎఫ్‌టీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
అభ్యర్థుల విధులు
పదో తరగతితో మెట్రిక్ రిక్రూట్ ద్వారా ఎంపికైనవారికి షెఫ్, స్టివార్డ్, హైజీనిస్ట్ జాబ్స్ ఉంటాయి. షెఫ్ పోస్టుకు ఎంపికైతే ఫుడ్ ప్రిపేర్ చేయాలి. ఆహార పదార్థాల స్టోర్ నిర్వహణ బాధ్యత చూసుకోవాలి. స్టివార్డ్‌గా సెలెక్ట్ అయితే వడ్డించే బాధ్యతలతో పాటు భోజనం వండే సమయంలో సహాయం చేయాలి. హైజీనిస్టులు పరిసరాలు క్లీనింగ్ చేసుకోవాలి. ఆర్టిఫీసర్ అప్రెంటిస్‌లు నేవీలో ఉపయోగించే టర్బైన్లు, యంత్రాల నిర్వహణ చూస్తారు. , మరమ్మతులు చేస్తారు. వీరికి డిప్లొమా సర్టిఫికెట్ అందిస్తారు. ఎస్‌ఎస్‌ఆర్ విభాగంలో చేరినవాళ్లు అధునాతన నౌకలు, సబ్ మెరైన్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అవసరమైన మరమ్మతుల బాధ్యత తీసుకుంటారు.
ఆన్‌లైన్ దరఖాస్తులు: ఎంఆర్ పోస్టులకు అక్టోబరు 29 నుంచి నవంబరు 2 వరకు స్వీకరిస్తారు.
వెబ్సైట్: www.joinindiannavy.gov.in
సెయిలర్ టూ మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్
ఈ మూడు విభాగాల్లో ఎందులో సెలెక్ట్ అయినా లెవెల్ 3 ప్రకారం రూ. 21700 బేసిక్ సాలరీ వస్తుంది. అన్ని అలవెన్స్‌లు కలుపుకుని ఎంఆర్, ఎస్‌ఎస్‌ఆర్‌లు ప్రారంభంలోనే రూ.35 వేలు, ఏఏలు రూ.42 వేల వరకు వేతన రూపంలో పొందవచ్చు. ఏఏకు ఎంపికైనవారు 20 సంవత్సరాలు, ఎంఆర్, ఎస్‌ఎస్‌ఆర్ విభాగాల్లో చేరినవాళ్లు 15 ఏళ్లు ఉద్యోగంలో కొనసాగవచ్చు. ఆ తర్వాత అభ్యర్థుల ఆసక్తి, నేవీ అవసరాలకు అనుగుణంగా సేవలు పొడిగిస్తారు. పదవీ విరమణ చేసినవారికి పూర్తిస్థాయి పింఛను జీవితాంతం లభిస్తుంది. సెయిలర్- ఎంఆర్, ఎస్‌ఎస్‌ఆర్, ఏఏగా విధుల్లో చేరినవారు మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్-1 (లెవెల్ 8) హోదా వరకు చేరుకోవచ్చు. వెలుగు, ఎడ్యుకేషన్ డెస్క్