![టెన్త్ బెటాలియన్‌కు 16 మెడల్స్](https://static.v6velugu.com/uploads/2025/02/tenth-battalion-wins-16-medals-at-state-level-police-sports-meet_q1mvXZuYPs.jpg)
గద్వాల, వెలుగు: రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్లో టెన్త్ బెటాలియన్ కు 16 మెడల్స్ రావడం హర్షణీయమని బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య తెలిపారు. శనివారం టెన్త్ బెటాలియన్ లో విజయ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ లో జరిగిన మూడవ రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో టెన్త్ బెటాలియన్ కు 5 గోల్డ్, 4 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయని తెలిపారు.
అనంతరం మెడల్స్ సాధించిన వారిని శాలువా, పూలమాలతో సత్కరించి, మెమోంటోలు అందించారు. అడిషనల్ కమాండెంట్ జయరాజు, అసిస్టెంట్ కమాండెంట్ లు నరేందర్ రెడ్డి, శ్రీనివాసులు, ఆర్ఐలు ఆర్పీ సింగ్, వెంకటేశ్వర్లు, రమేశ్ బాబు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.