హైదరాబాద్, వెలుగు: పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. పరీక్ష రాసిన వారిలో మొత్తం 73.03 శాతం మంది పాసైనట్టు అధికారులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 46731 మంది పరీక్షలు రాశారు. వారిలో 34,126 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంట్లో అబ్బాయిలు 29,142 మందికి గాను 20,694 (71.01%) మంది, అమ్మాయిలు 17,589 మందికి 13,432 (76.37%) మంది ఉన్నారు.
వందశాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్లో ఉండగా, వికారాబాద్ జిల్లా 42.14 శాతం మందితో చివరి స్థానంలో నిలిచింది. ఫలితాలను https://www.bse.telangana.gov.inలో పొందుపర్చారు. కొంతమంది విద్యార్థుల ఫలితాలను విత్ హెల్డ్ లో పెట్టినట్టు అధికారులు తెలిపారు. జులై 8లోగా రీకౌంటింగ్ , రీవెరిఫికేషర్కు అవకాశం ఉందని ప్రకటించారు.