
పదో తరగతి పరీక్ష తేదీల్లో మార్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మే 23 నుండి జూన్ 1 వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనుంది. ఇంటర్ పరీక్షల తేదీల మార్పుతో పదో తరగతి పరీక్షల తేదీలను మార్చింది ప్రభుత్వం. ఇంటర్ ఎగ్జామ్స్ మే 6 నుంచి 24 వరకు జరగనున్నాయి. పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు.