గచ్చిబౌలిలో ఆర్టీసీ బస్సు కింద పడి టెన్త్ విద్యార్థి మృతి

గచ్చిబౌలిలో ఆర్టీసీ బస్సు కింద పడి టెన్త్ విద్యార్థి మృతి

హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పరీక్ష రాసి ఇంటికి వెళ్తున్న టెన్త్ క్లాస్ విద్యార్థిని ఈ ప్రమాదంలో మృతి చెందడం విషాదం నింపింది. కుటుంబ సభ్యుల ఆందోళన, ఆక్రందనల మధ్య గచ్చిబౌలి ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

వివరాల్లోకి వెళ్తే.. పరీక్ష రాసి బైక్ పై వెళ్తున్న విద్యార్థులు ప్రమాద వశాత్తు ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్ కింద పడిపోయారు. గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పై బస్సు టైర్ల కింద బైక్ పడటంతో జరిగింది ఈ ప్రమాదం. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలు అయ్యాయి.

TNGO కాలనీ లో నివాసం ఉంటున్న సుమన్ ఛత్రియ.. తన చెల్లి ప్రభాతి ఛత్రియ (16)  పదవ తరగతి పరీక్ష రాయించి గచ్చిబౌలి రాయదుర్గం మార్గంలో వేళ్లుతున్నారు. ఈ క్రమంలో వారు వెళ్తున్న బైక్ అదుపుతప్పి కింద పడిపోవడంతో వెనకే వస్తున్న ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్ వారిపైనుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో అన్న సుమన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. చెల్లెలు ప్రభాతి ఛత్రియ ఈ ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయింది. 

ALSO READ | హైదరాబాద్లో సైకో వీరంగం.. కనిపించిన వారిపై కత్తితో దాడి.. సైకోను తాళ్లతో బిగించి..

ఈ ప్రమాదంతో అక్కడ ట్రాపిక్ జామ్ అయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. తీవ్రంగా రోధిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చి శాంతిపజేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు రాయదుర్గం పోలీసులు.