అర ఎకరంతో మొదలుపెట్టి.. 15 ఎకరాల్లో పూల సాగు చేస్తున్న టెన్త్ డిస్‌కంటిన్యూ స్టూడెంట్

రోజా పువ్వులు.. కాశ్మీర్‌ కూ పోతున్నయ్‌

రోజా పూలంటే ఇష్టంలేని వారుండరు. దాదాపు అందరి ఇళ్లలో రోజాపువ్వు మొక్క ఉంటుంది. ఇక వాలెంటైన్స్‌‌డే రోజయితే చెప్పనక్కర్లేదు. తమకు ఇష్టమైన వాళ్లకు రోజాపూలు ఇచ్చి ప్రేమను తెలియజేస్తుంటారు. స్పెషల్‌‌గా ‘రోజ్‌‌ డే’ అని కూడా ఉంటుంది. ఆ రోజా పూలకు ఉన్న డిమాండ్‌‌ను తెలుసుకున్నాడు మహారాష్ట్రలోని పుణె జిల్లా మావల్‌‌కు చెందిన ముకుంద్‌‌ ఠాకూర్‌‌‌‌. ఎక్కడ చూసినా గులాబీలు వనంలా కనిపించే జమ్మూకాశ్మీర్‌‌‌‌కు కూడా గులాబీలను ఎక్స్‌‌పోర్ట్‌‌ చేస్తున్నాడు.

ఆర్థిక పరిస్థితులు బాలేక చదువు ఆపేశాడు. ఆ తర్వాత నెల రోజులు హార్టీ కల్చర్‌‌‌‌ కోర్సు చేసి దాన్నే ఉపాధిగా మార్చుకున్నాడు. వరి పండించే తన పొలంలో రోజాపూల పాలీహౌస్‌‌ పెట్టాడు. అర ఎకరంలో మొదలుపెట్టిన సాగు.. ఇప్పుడు 15 ఎకరాలకు పెరిగింది.

ముకుంద్‌‌ ఠాకూర్‌‌‌‌ది వ్యవసాయ కుటుంబం. ఎప్పుడూ వరి, చెరకు మాత్రమే పండించేవాళ్లు. ఆ పంటల వల్ల ఏటా నష్టాలే. దీంతో ఆర్థిక పరిస్థితుల కారణంగా పదోతరగతి చదవకుండా మధ్యలోనే మానేశాడు. ఆ తర్వాత 2005లో నేషనల్‌‌ హార్టీకల్చర్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో నెల రోజుల కోర్సు చేశాడు. రోజా పూల ఫార్మింగ్‌‌ గురించి తెలుసుకుని తన అరెకరం పొలంలోపాలీహౌస్‌‌ ఏర్పాటు చేసి రోజాపూల సాగు మొదలుపెట్టాడు. అది మంచి ఫలితాలు ఇవ్వడంతో ఇప్పుడు దాదాపు 15 ఎకరాల భూమిని లీజ్‌‌కు తీసుకుని రోజా పూల సాగు చేస్తున్నాడు. అంతే కాకుండా ‘పవన ఫూల్‌‌ ఉత్పాదక్‌‌’ అనే సంఘాన్ని పెట్టి మిగతారైతులకు సాయం చేస్తున్నాడు కూడా.

రోజాలో రకాలెన్నో

“ ఇప్పటివరకు 13 మంది రైతులకు లోన్లు ఇప్పించా. మరో 14 మందికి లోన్లు ప్రాసెసింగ్‌‌లో ఉన్నాయి. మార్కెట్‌‌ అవసరాలు ఏంటి? ఎలాంటి పూలకు డిమాండ్‌‌ ఉంది? అనే విషయాలు తెలుసుకునేందుకు దాదాపు రెండేళ్ల పాటు దేశంలోని అతిపెద్ద పూల మార్కెట్లు అయిన హైదరాబాద్‌‌, పుణె, బెంగళూరు, ముంబైలో తిరిగాను. మార్కెట్‌‌లో ఎలాంటి పూలకు గిరాకీ ఉందనే దాన్నిబట్టి సాగు చేయడం మొదలుపెట్టి సక్సెస్‌‌ అయ్యాను. అలా రకరకాల పూలను సాగు చేయడం స్టార్ట్‌‌ చేశాం. రోజా పూలల్లో చాలా రకాలు ఉంటాయనే విషయం చాలామందికి తెలీదు. అందరూ రోజా పూలంటే కేవలం ‘రెడ్‌‌ కలర్‌‌’‌‌ అనే అనుకుంటారు. కానీ, వాటిలో చాలారకాలు ఉంటాయి. ఒక్కో రంగు రోజా ఒక్కోదానికి గుర్తుగా వాడతారు. రెడ్‌‌ రోజ్‌‌ అంటే లవ్‌‌. వైట్‌‌ రోజ్​ అంటే పెళ్లి, ఆధ్యాత్మికం.పసుపు రోజాకు అక్కడక్కడా ఎరుపు రంగు ఉంటే ప్రేమలో పడ్డానని.. పింక్‌‌ అంటే గ్రేస్‌‌, ఎలిగెన్స్.  వైట్‌‌, రెడ్‌‌ మిక్స్‌‌ అయితే యూనిటీ. అన్ని రంగులు కలిపి అందమైన బొకేను తయారు చేసి వాలంటైన్స్‌‌ డే రోజు ప్రపోజ్‌‌ చేయొచ్చు. ఏటా వాలంటైన్స్‌‌డేకి మస్తు బిజినెస్‌‌ అయితది. పోయిన ఏడాది నేను ఒక్కడినే 7లక్షల పూలు ఎక్స్‌‌పోర్ట్‌‌ చేశా. ఈసారి కరోనా వల్ల అది ఐదు లక్షలకు చేరింది. ఈఏడాది ‘హంగేరి’కి కూడా పూలు పంపాం” అని అంటున్నాడు ఠాకూర్‌‌‌‌.

వలసలు ఆగాయి

ఠాకూర్‌‌‌‌  ఇచ్చిన ఐడియాతో మాల్వాలో ఇప్పటివరకు 1300 పాలీహౌస్‌‌లు వచ్చాయి. దాదాపు 50 ఎకరాల్లో రోజాపూలు సాగు చేస్తున్నారు. దీంతో మహారాష్ట్రలో మవాల్‌‌ ‘ఫ్లోరీ కల్చర్‌‌’‌‌ హబ్‌‌గా తయారైంది. “మాల్వాలో ఉండే యూత్‌‌కు ఉద్యోగాలు వచ్చాయి. లోకల్స్‌‌కు పనిదొరకడంతో వలసలు తగ్గాయి. పూలు కోయడం, వాటిని ప్యాకింగ్‌‌ చేయడం వరకు విడివిడిగా టీమ్‌‌లు ఉంటాయి. మాల్వాలోని పువ్వులు కాశ్మీర్‌‌‌‌కు కూడా ఎక్స్‌‌పోర్ట్‌‌ చేస్తున్నారు. ఇప్పుడు ఫారిన్‌‌ కంట్రీస్‌‌కు కూడా వెళ్తున్నాయి. ఫ్లోరీ కల్చర్‌‌‌‌ ఖర్చుతో కూడుకున్నది. డబ్బుకు ఇబ్బంది లేకుండా నేషనల్‌‌ హార్టీ కల్చర్‌‌ బోర్డ్‌‌ సబ్సిడీ కింద లోన్‌‌ కూడా ఇస్తుంది” అని లోకల్‌‌ అగ్రికల్చర్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ చెప్పారు.

For More News..

తండ్రి రాజ్యసభ సభ్యుడు, కొడుకు కార్పొరేషన్ చైర్మన్, కూతురు మేయర్

ఫార్మసీ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గ్యాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. కన్ఫమ్ చేసిన పోలీసులు