
- సీఎస్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ సస్పెన్షన్
- కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో ఘటన
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా జుక్కల్ జడ్పీ హైస్కూల్లో బుధవారం మ్యాథ్స్ ఎగ్జామ్ పేపర్లోని కొన్ని ప్రశ్నలు పేపర్‌పై రాసి బయటకు పంపిన ఘటనపై అధికారులు ఎంక్వైరీ ప్రారంభించారు. ప్రాథమిక విచారణ అనంతరం సెంటర్ చీఫ్‌సూపరింటెండెంట్ ఎం.సునీల్( స్కూల్ అసిస్టెంట్, డొంగ్లి), డిపార్ట్మెంటల్ ఆఫీసర్ వి.భీమ్(స్కూల్ అసిస్టెంట్, మద్నూర్), ఇన్విజిలేటర్ సోమూర్ను సస్పెన్షన్ చేసినట్లు డీఈవో రాజు తెలిపారు.
జుక్కల్ సెంటర్లో ఎగ్జామ్ రాస్తున్న ఓ విద్యార్థి పేపర్‌పై ప్రశ్నలు రాసి బయటకు పంపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆ తరువాత సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు సమాచారం. విషయం తెలియడంతో కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ ఎంక్వైరీకి ఆదేశించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఈవో రాజు, ఇతర అధికారులు జుక్కల్ వెళ్లి విచారణ చేపట్టారు. సీఎస్, డీవో, ఇన్విజిలేటర్లు, స్టూడెంట్స్‌తో మాట్లాడారు. సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.