టెన్త్​ ఫలితాలు.. సత్తా చాటిన గర్ల్స్ 

  • రాష్ట్ర స్థాయిలో సూర్యాపేట15,  నల్గొండ 17,  యాదాద్రి 26వ స్థానం

నల్గొండ/యాదాద్రి/సూర్యాపేట, వెలుగు: పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బాలికల హవా కొనసాగింది. నల్గొండ జిల్లాలో 19,236 మంది స్టూడెంట్స్​ ఎగ్జామ్స్​ రాయగా 17,234  మంది పాసయ్యారు. 89.59 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇందులో బాలురు 9,886 మంది పరీక్షలు రాయగా 8,772 మంది (88.73శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 9,350 మంది పరీక్షలు రాయగా ,  8,462 (90.5శాతం) ఉత్తీర్ణులయ్యారు. జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 17 స్థానం లభించింది. 

ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఫలితాలు ఇలా... 

నల్గొండ జిల్లాలో ఐదు ఎయిడెడ్​ స్కూళ్లలో 97.04 శాతం ఫలితాలు రాగా ఒక స్కూల్​లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండు ఆశ్రమ స్కూళ్ల​లో 81.03 శాతం, 14 బీసీ వెల్ఫేర్​ వసతి గృహ విద్యార్థులు 98.79 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఏడు వసతి గృహాలు వంద శాతం ఫలితాలు సాధించాయి. 21 ప్రభుత్వ స్కూళ్ల​లో 78.78 శాతం ఫలితాలు రాగా,  ఒక పాఠశాలలో వంద శాతం ఫలితాలు వచ్చాయి. 27 కేజీబీవీలోల్ 80.96 శాతం ఉత్తీర్ణత సాధించగా, అందులో ఒక స్కూల్​లో వంద శాతం ఉత్తీర్ణత వచ్చింది. 17 మోడల్​ స్కూళ్లలో 85.61 శాతం ఫలితాలు రాగా ఒక స్కూల్​లో వంద శాతం సాధించింది. 156 ప్రైవేటు స్కూల్స్​లో 96.38 శాతం ఫలితాలు రాగా 75 స్కూళ్ల​లో వంద శాతం ఫలితాలు సాధించారు. 11 సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ స్కూళ్ల​లో 98.57 శాతం ఫలితాలు రాగా, మూడు స్కూళ్ల​లో వంద శాతం, 8 ట్రైబల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ స్కూళ్ల​లో 96.96 శాతం, నాలుగు స్కూళ్ల​లో వంద శాతం ఫలితాలు వచ్చాయి. జడ్పీహెచ్​ఎస్​లో 213 స్కూల్స్​లో 82.14 శాతం ఫలితాలు సాధించగా, 39 స్కూళ్ల​లో వంద శాతం ఫలితాలు వచ్చాయి. 

పర్సెంటేజ్ తగ్గింది.. ర్యాంక్ పెరిగింది

సూర్యాపేట జిల్లా టెన్త్​ రిజల్ట్​లో ఈసారి పర్సంటేజ్​తగ్గినా ర్యాంక్ లో కాస్త మెరుగుపడింది.  రాష్ట్రంలో గతేడాది 17వ స్థానంలో నిలువగా ఈసారి15వ స్థానంలో నిలిచింది. ఫలితాల్లో బాయ్స్​ కంటే గర్ల్స్​ ఉత్తీర్ణత ఎక్కువుంది. బాలురు 88.8 శాతం, బాలికలు 91.14 శాతం ఉత్తీర్ణులయ్యారు . మొత్తం జిల్లావ్యాప్తంగా 12,190 మంది పరీక్షలు రాయగా10,963 మంది పాస్​ అయ్యారు.  89.93 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 6,278 మంది పరీక్షలు రాయగా 5,575 మంది , బాలికలు 5,912 మందికి 5,388 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ప్రభుత్వ , ప్రైవేట్ స్కూళ్లు మొత్తం 349 పాఠశాలలు ఉండగా 89.93శాతం ఉత్తీర్ణత సాధించాయి.  ఎయిడెడ్ పాఠశాలలో 85.71, గురుకులలలో 68.06, బీసీ వెల్ఫేర్ 96.21, ప్రభుత్వ పాఠశాలల్లో 75.54, కేజీబీవీ 79.37, మోడల్ స్కూళ్లు 86.59, రెసిడెన్షియల్ స్కూళ్లు 100, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు 98.35, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ 95.96, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ 94.92, జిల్లా పరిషత్ స్కూల్స్ 82.16శాతం ఉత్తీర్ణత సాధించాయి. ప్రైవేట్ స్కూళ్లు 97.85శాతం ఉత్తీర్ణత సాధించాయి.

99 పాఠశాలలలో 100 శాతం రిజల్ట్స్

జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలలో 99పాఠశాలలు 100శాతం రిజల్ట్స్ సాధించాయి. వీటిలో 67 ప్రైవేట్ స్కూళ్లు ఉండగా 24 జిల్లా పరిషత్ పాఠశాలలు, 2 సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు, 2 బీసీ వెల్ఫేర్ స్కూళ్లు, ఎయిడెడ్, కేజీబీవీ, రెసిడెన్షియల్, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఉన్నాయి.

యాదాద్రి పూర్​ టెన్త్​ రిజల్ట్​లో యాదాద్రి జిల్లా 2016--–17 తర్వాత ఇంత తక్కువ రిజల్ట్​ రావడం ఇదే మొదటిసారి. గతేడాది 93.61 శాతం రిజల్ట్​ వచ్చి స్టేట్​ లెవల్​లో 13వ ర్యాంక్​కు పెరిగిన జిల్లా ఈసారి రిజల్ట్​లో 80.97 శాతానికి తగ్గి స్టేట్​ లెవల్లో 26వ ర్యాంక్​కు పడిపోయింది. రిజల్ట్​ తగ్గినా ఎప్పటిలాగే బాలికలదే పైచేయి సాధించారు.  జిల్లాలో 8,973 మంది స్టూడెంట్స్​ పరీక్ష రాయగా 7,265 (80.97 శాతం )మంది పాసయ్యారు. అందులో 4,435 మంది బాయ్స్​ ఎగ్జామ్​ రాయగా 3,439(77.54 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 4,538 మంది గర్ల్స్​ ఎగ్జామ్ రాయగా 3,826 (84.31శాతం) పాసయ్యారు. 13 గవర్నమెంట్​ స్కూల్స్​లో వంద శాతం స్టూడెంట్స్​ ఉత్తీర్ణత సాధించారు. 39 మందికి 10 /10 జీపీఏ రాగా ఇందులో జడ్పీహెచ్​ఎస్​, మోడల్ ​స్కూల్​ నుంచి ఒక్కొక్కరు 10 /10 సాధించగా, రెసిడెన్షియల్​ స్కూల్స్​ నుంచి 9, బీసీ, ఎస్సీ వెల్ఫేర్​ స్కూల్స్​​ నుంచి ముగ్గురు చొప్పున,  ప్రైవేట్​ స్కూల్స్​కు చెందిన  22  మంది స్టూడెంట్స్​10 /10 సాధించారు. కాగా జిల్లాలోని ఏకైక ఎయిడెడ్​ స్కూల్​ లో ఒక్కరే పదో తరగతి ఎగ్జామ్​ రాయగా ఆ ఒక్క స్టూడెంట్​ ఫెయిలయ్యాడు. 

నిత్యం పర్యవేక్షణే అయినా..

టెన్త్​ స్టూడెంట్ల ప్రిపరేషన్​కు  ఎప్పటికప్పుడు హయ్యర్​ ఆఫీసర్లు పర్యవేక్షించారు. నిత్యం స్కూళ్లలో పర్యటిస్తున్నారు. అయినప్పటికీ పూర్​ రిజల్ట్​ వచ్చింది. జిల్లా ఏర్పడిన తర్వాత ఇంత తక్కువ పర్సంటేజ్​ రావడం, స్టేట్​ లెవల్లో 26వ స్థానానికి పడిపోవడం ఆందో ళన కలిగిస్తోంది.  రిజల్ట్​ ఆల్​టైం రికార్డ్​ స్థాయిలో తగ్గడానికి గల కారణాలపై ఆఫీసర్లు  చర్చిస్తున్నారు.