రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో దారుణం జరిగింది. స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి టెన్త్ విద్యార్థి(నీరజ్) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఫిబ్రవరి 5న సాయంత్రం నీరజ్..మరో విద్యార్థి స్కూల్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ లోని బాల్కనీలో ఏదో మాట్లాడుతుండగా ప్రిన్సిపల్ ఇద్దరిని తన గదిలోకి పిలిచి మందలించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రిన్సిపల్ మందలించడం వల్లనే మనస్థాపానికి గురైన నీరజ్ టాయిలెట్ కోసం వెళ్తున్నట్లు చెప్పి బిల్డింగ్ పై నుంచి దూకాడని చెబుతున్నారు. భవనం పై నుంచి కింద పడిన నీరజ్ అపస్మారక స్థితికి వెళ్లాడు. వెంటనే నీరజ్ ను మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి నీరజ్ బీజేపీ షాద్ నగర్ పట్టణ అధ్యక్షుడు హరి భూషణ్ కుమారుడిగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.