
బర్త్డే నాడే.. బావిలో శవమై..
టెన్త్ స్టూడెంట్ మృతి
హత్య చేశారని తండ్రికి డౌట్
మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. బర్త్ డే వేడుకలు జరుపుకోవాల్సిన కొడుకు బావిలో శవమై తేలడంతో ఫ్యామిలీమెంబర్స్ కన్నీరు మున్నీరయ్యారు. మ్యాడంపల్లికి టెన్త్ స్టూడెంట్ జలంధర్ ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లి రాత్రి వరకు తిరిగిరాలేదు. ఎంత వెతికినా అతని జాడ తెలియకపోవడంతో ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం గ్రామ శివారులోని వ్యవసాయ బావి దగ్గర చెప్పులు కనిపించాయి. బావిలో వెతకగా జలందర్ శవం కనిపించింది. అయితే .. తన కొడుకును చంపేసి బావిలో వేశారని అతని తండ్రి నాగేందర్ అనుమానం వ్యక్తం చేశారు. గ్రామానికే చెందిన ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం హత్యకు కారణమని, ఆమె బంధువులే చంపి ఉంటారని ఆరోపించారు. కేసు దర్యాప్తులో ఉంది.