
మియాపూర్, వెలుగు: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూల్ బిల్డింగ్ ఐదో ఫ్లోర్ నుంచి పదో తరగతి స్టూడెంట్దూకాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. మియాపూర్ గోకుల్ ప్లాట్స్ కాలనీలో నివాసం ఉంటున్న జె. రవి కుమార్, వాసంతి దంపతులకొడుకు హరీష్చంద్ర ప్రసాద్(15) క్వాంటామ్ లీఫ్ స్కూల్ లో పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం స్కూల్ అయిపోయాక హరీష్చంద్ర ప్రసాద్ స్కూల్ బిల్డింగ్ 5 వ నుంచి కిందికి దూకాడు.
అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం అందించి, దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్గా ఉండడంతో మాదాపూర్ ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్టూడెంట్ స్కూల్ బిల్డింగ్పై నుంచి దూకడానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై తల్లిదండ్రుల నుండి ఏలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు పేర్కొన్నారు.