
గండీడ్, వెలుగు : రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ హైజంప్ పోటీల్లో మహమ్మదాబాద్ మండలం నంచర్ల గురుకుల పాఠశాలకు చెందిన టెన్త్ స్టూడెంట్ లావణ్య గోల్డ్మెడల్ సాధించింది. కరీంనగర్ లో జరుగుతున్న పోటీల్లో పాల్గొని సత్తా చాటిన లావణ్యను పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటమ్మ, టీచర్లు అభినందించారు.