ప్రేమలో ఫెయిల్ ​అయి పదో తరగతి బాలిక ఆత్మహత్య

'అన్నయ్య.. అమ్మ నాన్నలను జాగ్రత్తగా చూసుకో. నేను ప్రేమ పేరుతో మోసపోయాను. ఒకరు నన్ను టార్చర్​ చేస్తున్నారు. బతకాలని లేదు. మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతున్నాను. నా లైఫ్​ ముగిసింది. మిమ్మల్ని మిస్​ అవుతున్నాను'.. అంటూ ఓ బాలిక రాసిన సూసైడ్​నోట్ చూపరులను కంటతడి పెట్టిస్తోంది. 

ప్రేమ పేరుతో ఒకరి చేతిలో మోసపోయానని బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్​లో ఆగస్టు 26న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. 

ఆమె తల్లి శనివారం ఉదయం కూరగాయల మార్కెట్​కు వెళ్లి  పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి చూసే సరికి బాలిక దూలానికి ఉరేసుకుని ఉంది. తల్లి ఆందోళన చెంది ఆమెను కిందకి దించింది. బాలిక అప్పటికే మృతి చెందింది. 

ప్రేమించిన వ్యక్తి సోషల్​ మీడియాలో వేధిస్తున్నందుకే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అతని ఫోన్​ నంబర్​సూసైడ్​లెటర్​లో రాసి ఉంది. ప్రేమించిన వ్యక్తి మైనర్ ​అని పోలీసులు వెల్లడించారు.  

తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.