
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: టెన్త్ స్టూడెంట్ చెరువులోఈతకు వెళ్లి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సూరారం గ్రామానికి చెందిన జక్కుల సంపత్(15) పాండురంగాపురం హైస్కూల్‌లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. శనివారం మ్యాథ్స్ ఎగ్జామ్ రాసిన సంపత్ ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలో ఉన్న చెరువులో ఈతకు వెళ్లాడు. ఈత పెద్దగా రాని సంపత్ లోతుకు వెళ్లడంతో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు సంపత్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని గ్రామస్తులతో కలిసి డెడ్‌బాడీని బయటికి తీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సంపత్ మృతదేహానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నివాళి అర్పించారు.