హైదరాబాద్​లో టెంత్​పిన్​ ఏఐ ల్యాబ్​

హైదరాబాద్​లో టెంత్​పిన్​ ఏఐ ల్యాబ్​

హైదరాబాద్​, వెలుగు: స్విట్లర్లాండ్​కు చెందిన టెంత్​పిన్ మేనేజ్​మెంట్​కన్సల్టంట్స్​ హైదరాబాద్​లో బుధవారం ఏఐ ల్యాబ్స్​ను అందుబాటులో తెచ్చింది. దీని ద్వారా లైఫ్​సైన్సెస్​ ఇండస్ట్రీకి ఏఐ ఆధారిత సొల్యూషన్స్​ అందిస్తామని తెలిపింది. ఫార్మా, మెడ్​టెక్, బయోటెక్​, రీసెర్చ్​ఆర్గనైజేషన్లకు ఏఐ అప్లికేషన్లను తయారు చేస్తామని పేర్కొంది. 

తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్​రంజన్​టెంత్​ఫిన్​ సెంటర్​ ఆఫ్​ ఎక్సలెన్స్​ను, ల్యాబ్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెంత్​పిన్​  ఏఐ ల్యాబ్ ​హైదరాబాద్ ​లైఫ్​సెన్సెస్​ఇండస్ట్రీ ఎకోసిస్టమ్​ను బలోపేతం చేస్తుందన్నారు. త్వరలో లైఫ్​సైన్సెస్ ​కంపెనీల కోసం ప్రత్యేక పాలసీ తెస్తామని వెల్లడించారు.