టెంట్లు సామగ్రి కొని వాడుతలేరు

గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వ అవసరాలకు వాడుకునేందుకు గతేడాది ఫిబ్రవరిలో రూ.6.95లక్షలతో టెంట్లు, ఇతర సామగ్రిని కొనుగోలు చేసి మూలనపడేశారు.  రామగుండం సిటీలో 50 డివిజన్లు ఉన్నాయి. వీటిల్లో బహిరంగ ప్రదేశాల్లో మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించాల్సి వచ్చినప్పుడు కిరాయికి తెస్తున్నారు.

దీంతో బల్దియాపై ఆర్థిక భారం పెరుగుతోంది.  ఇటీవల నిర్వహించిన ప్రజాపాలన సభలకు కూడా కుర్చీలు, టెంట్లు, ఇతర సామగ్రి రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చారు. ఇందుకు ఒక్కో డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.10వేల చొప్పున రూ.5లక్షలు ఖర్చయింది. కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ ఆఫీసర్​కమీషన్​కోసం ప్రైవేట్​వారికి కొటేషన్​పద్ధతిన అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది.  దీనిపై బల్దియా కమిషనర్​మాట్లాడుతూ కార్పొరేషన్​తరఫున కుర్చీలు, టెంట్లు వగైరా లేకపోవడంతో కొటేషన్​పద్ధతిలో కిరాయికి తెప్పించామన్నారు. బల్దియా కొనుగోలు చేసిన సామగ్రిని ఆఫీసుల్లో వాడుతున్నామన్నారు.