దీక్షా శిబిరంలో కూలిన టెంట్లు..ముగ్గురు అంగన్​​వాడీలకు గాయాలు

ధర్మపురి, వెలుగు: సమ్మెలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి తహసీల్దార్ ​ఆఫీస్ ఎదుట నిరసన తెలుపుతున్న అంగన్​వాడీ టీచర్లు, హెల్పర్లపై గురువారం టెంట్లు​ కూలడంతో ముగ్గురు గాయపడ్డారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కొన్ని రోజులుగా తహసీల్దార్​ఆఫీసు ఎదుట టెంట్లు​వేసుకుని నిరసన తెలుపుతున్నారు.

గురువారం తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో టెంట్లు తడిసిపోయాయి. అవి కూలి నిరసన తెలుపుతున అంగన్​వాడీలపై పడ్డాయి. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంతో ఆటోలో దవాఖానకు తరలించి చికిత్స అందించారు.